ప్రపంచంలో మనకు భయాన్ని కలిగించే ప్రదేశాలు – Awful places in the world
Places in the world that scare us
ప్రపంచంలో మనకు భయాన్ని కలిగించే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనేక మంది ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి చాలా భయపడుతుంటారు.
1. ఐ లాండ్ అఫ్ డాల్స్ (Island of Dolls)
మెక్సికో దేశంలో ఒక ఐ ల్యాండ్ లో డాన్ జులియాన్స్ హ్యాంట్టానా అనిఒకవ్యక్తి ఉండేవాడు. అతను చూస్తుండగానే 12 సంవత్సరాల ఒక అమ్మాయి నీళ్ళల్లో మునిగి చనిపోయింది.తరువాత రోజు ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయిందో అదే ప్రదేశంలో ఒక చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ తేలుతూ కనిపించింది. ఆటను ఆ బొమ్మను తీసుకువచ్చి ఆ దీవిలోని ఒక చెట్టుకు తగిలించాడు. ఆ తరువాత రోజునుంచి రోజుకో బొమ్మ తేలుతూ కనిపించింది. ఇలా కనిపించిన అన్ని బొమ్మలను చెట్టుకు తగిలించేవాడు. ఇలా అతను చనిపోయేవరకు బొమ్మలను వేలాడదీసేవాడు. అక్కడి దగ్గర ప్రాంతంలో నివసించేవారు ఏమిచెపున్నారంటే ఆ బొమ్మలతో అక్కడ చనిపోయిన అమ్మాయి ఆత్మ ఉంది. అప్పుడప్పుడు బొమ్మలు కదలడం, కనురెప్పలు ఆర్పడం చూశామని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ అమ్మాయి ఎక్కడ మునిగి చనిపోయిందో డాన్ జులియాన్స్ హ్యాంట్టానా కూడా అక్కడే మునిగి చనిపోయాడు. ఇప్పుడు ఇది పెద్ద టూరిస్ట్ స్థలంగా మారింది.
2. ఓకి గహార ఫారెస్ట్ (Aokigahara Forest)
మనుషులు ఆత్మహత్యలు చేసుకొనే ఫారెస్ట్ గా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతీ సంవత్సరం ఇక్కడికి 200 మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి వస్తారు. ఈ ఫారెస్ట్ ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయని ఇక్కడి ప్రభుత్వం ఈ ఫారెస్ట్ గురించి ఎవ్వరికీ చెప్పకూడదని మీడియాను కోరింది. చాలా మంది టూరిస్టు సరదాగా డెడ్ బాడీస్ చూద్దామని అక్కడికి వెళ్తుంటారు.
3. పాములదీవి (స్నేక్ ఐలాండ్) – Snake Island
కొన్ని లక్షల కట్లపాములు (వైఫర్ స్నేక్) ఈ దీవిలో ఉంటాయి. ఈ పాములు చాలా విషపూరితం. మనం ఈ దీవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి అడ్డుక్కు ఒక పాము కనిపిస్తుంది. ఈ దీవికి వెళ్లిన ప్రతి ఒక్కరు చనిపోయారు. ప్రస్తుతం బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ వెళ్లాలనుకున్నవారికి అనుమతి ఇవ్వడం లేదు.
4. లేక్ నేట్రోన్
టాన్ జీనియా అనే దేశంలో లేక్ నేట్రోన్ అనే ఒక నది ఉంది. ఈ నదిని సాల్ట్ అండ్ సోడా లేక్ అంటారు. ఈ నది ఉష్ణోగ్రత 40 డిగ్రీ/సెంటిగ్రేట్ వరకు ఉంటుంది. ఈ నది ఇంట వేడిగా ఉండటం వల్ల నదిలో ఉన్న నీరంతా సోడియం కార్బొనేట్ డేటా హైడ్రేట్ అనే ఒక సోడియం తయారవుతుంది. ఈ పదార్థాన్ని ఈజిప్టియన్లు మమ్మీలు తయారు చేయడానికి వాడేవారు. ఈ నదిపై నుంచి ఎటువంటి పక్షులు ఎగిరినా,నదిలో నీటిని త్రాగడానికి ఎటువంటి జంతువులూ వచ్చిన అవి వెంటనే చనిపోయి రాళ్ళ లాగా మారిపోతాయి.
5. జఠాన్ గా (Jatanga)
మనదేశంలో అస్సాం రాష్ట్రంలో జఠాన్ గా అనే పల్లెటూరు ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు వందలాది పక్షులు ఆకాశం నుండి కింద పడిపోయి సూసైడ్ చేసుకుంటాయి. 37 రకాల జాతి పక్షులు ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్నాయి. ఇవి ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకున్నాయి చెప్పడానికి ఆధారం దొరకడం లేదు.
6.వించెస్టర్ మిస్టరీ హౌస్ (Winchester House)
కాలిఫోర్నియాలో వించెస్టర్ గన్స్ తయారు చేసే కంపెనీ ఓనర్ పేరు విలియం వించెస్టర్. ఇతను చనిపోయిన తరువాత తన భార్య అయిన సారా వించెస్టర్ కి తన ఆస్తి అంతా వచ్చింది. ఆ రోజు నుండి తన భర్త ఆత్మ తనను ఇంటిలోనుంచి బయటకు వెళ్ళద్దని పీడిస్తోందని చెప్పేది. అంటే కాకుండా తన భర్త తయారు చేసిన గన్స్ కారణంగా చనిపోయిన ఆత్మలు కూడా తనను పీడిస్తున్నాయని చెప్పేది. ఆతరువాత ఆమె తెలివిగా ఆలోచించి ఆ ఇంట్లో ఉండే దెయ్యాలను వదిలించుకోవడానికి ఒక కొత్త రకమైన హౌస్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. అదేంటంటే ఆ ఇంటికి ప్లానింగ్ అనేది ఉండదు. ఉదాహరణకు ఆమె ఇంటి తలుపును తెరిచిన వెంటనే అక్కడ దారి ఉండదు ఒక పెద్ద గోడ మనకు కనిపిస్తుంది. ఇటువంటి అనేక నిర్మాణాలను ఆమె చనిపోయే వరకు వందకు పైగా నిర్మించింది. ఇప్పుడు కాలిఫోర్నియా లో ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్.
7. కాటకొమ్స్ అఫ్ పారిస్ (Catacombs of Paris)
ప్రపంచంలో అతి పెద్ద శ్మశానం పారిస్ లో ఉంది. 60,00000 మనుషుల పుర్రెలతో తయారు చేసిన పెద్ద పాతాళ గుహ వుంది. భూమిలోపల నెట్వర్క్ లాగా ఇలాంటి గుహలు అక్కడ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని వందల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి. గుహ లోపల ఉండే గోడలన్నీ కూడా కొన్ని వందల మంది మనుషుల పుర్రెలతో నిర్మించబడి ఉంటాయి. కొన్ని కిలోమీటర్ల వరకు అనేక మనుషుల పుర్రెలతో ఈ దారి వ్యాపించి ఉంటుంది. అందువల్ల ఇక్కడ నడిచే వారు ఎక్కువగా భయపడుతుంటారు.