HorrorPlants & Animals

Dangerous Trees in world – మనుషుల ప్రాణాలు తీసే చెట్లు

ప్రపంచంలోని ప్రకృతిలో మనకు  తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి.  వాటిలోంచి మనం ఈరోజు మనుషుల ప్రాణాలు తీసి రక్తాన్ని త్రాగే చెట్ల గురించి తెలుసుకుందాం. మనుషులు మరియు జీవుల రక్తాన్ని త్రాగే వృక్షాల గురించి శాస్త్రవేత్తలు ఇప్పటికి వీటి రహస్యం గురించి పరిశోధనలు జరుపుతున్నారు. వీటిలో కొన్ని చెట్లు మత్తును వెదజల్లి జీవుల రక్తాన్ని త్రాగుతాయి మరికొన్ని చెట్లు అమాంతం జీవులను మింగేస్తాయి. ఈ చెట్లు ఎక్కువగా అమెజాన్ అడవుల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ అడవులకు వెళ్లిన వారిలో కొన్ని వేల మంది మనుషులు అదృశ్యమవుతున్నారు.

మనుషులు మరియు జీవజాతిని చంపే చెట్లలో ముఖ్యంగా 3 చెట్లను కనుగొన్నారు. ఇవి మనుషుల ప్రాణాలు తీసి వాటి ఆకలిని తీర్చుకుంటాయి.

  1. మారిటర్ ట్రీస్ 
  2. కార్నివొరస్  ట్రీస్
  3. బ్లడ్ సక్కర్ ట్రీస్ 
అమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో అక్కడి జంతుజీవుల గురించి పరిశోధన చేసేటప్పుడు అక్కడ అనేక మంది అదృశ్యమయిన ఆనవాళ్లు కొంతమంది గాయాలతో చనిపోయిన వారి శరీరాలు వారి దృష్టికి వచ్చాయి.
కొంతమంది పరిశోధకులు ఆట్రియా , డ్యూనాక్  అనేపేరుగల వృక్షాలను కనుగొన్నారు.  ఈ చెట్లు  చూడటానికి ఏనుగు తొండం లాగా అన్ని వైపులా కొమ్మలతో విశాలమైన ఆకులతో కనిపిస్తాయి. ఇవి వాటి క్రింద నుంచి నడిచి వెళ్లే మనుషులు మరియు ఇతర జీవులను అమాంతం కొమ్మలతో పట్టుకొని గట్టిగా అదిమేసి స్పృహ కోల్పోయేలా చేసి తరువాత రక్తం పీల్చివేస్తాయని పరిశోధకుల బృందం తేల్చింది.
సహజ పరిణామ క్రమాన్ని గురించి చెప్పిన చార్లెస్ డార్విన్ తన పరిశోధనలో ఇటువంటి రాక్షస జాతి వృక్షాలను చూసినట్లు తాను రాసిన ఇన్సెక్టీ వొరస్ ప్లాంట్  పుస్తకంలో రాసాడు.
రార్  మెకల్స్  అనే పరిశోధకుడు కూడా జీవుల రక్తాలకు రుచి మరిగిన రాక్షస వృక్షాల గురించి తానూ రాసిన హిడెన్ ఆనిమల్స్  అనే గ్రంథంలో పేర్కొన్నాడు.
1935 లో బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే హీడ్స్ అనే వ్యక్తి మడగాస్కర్ లోని రైన్ ఫారెస్ట్ కి వెళ్లి స్థానికుల సహాయంతో దాదాపు నాలుగు నెలల పాటు ఈ రాక్షస వృక్షాలపై ఎడతెరపి లేకుండా పరిశోధనలు చేసాడు. చివరికి అతడు బ్లడ్ సక్కర్ ట్రీస్ (దీనిని డెవిల్ ట్రీ అనికూడా అంటారు)  జాడను కనుక్కున్నాడు.
కొంకణి జలాశయం వద్దగల కుమాగా వృక్షాలు అత్యంత ప్రమాదకరమైనవి.  ఈ వృక్షాల నుండి వెలువడే విష వాయువులు ఎలాంటి జీవులనయినా హతమారుస్తాయి. ఈ చెట్ల పై వాలే పక్షులు ప్రాణాలు వదిలి క్రిందకు పడిపోతాయని అక్కడి స్థానికులు చెప్తున్నారు. ఈ వృక్షాలు చాలా వరకు వాటి విషపు గాలులను వెదజల్లుతాయి . ఆ పరిసరాలలోకి మనుషులు వెళ్లిన తరువాత ఏదైనా తినడం గాని త్రాగడం గాని చేయడం అత్యంత ప్రమాదకరం అని అక్కడి స్థానికులు హెచ్చరిస్తూ ఉంటారు.
మనదేశంలో కూడా మంగళూరు అడవుల్లో ఇలాంటి చెట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు
విశ్వంలో మనకు తెలియని అనేక విషయాలను, వింతలు, రహస్యాలను తెలుసుకోవాలంటే telugudiscovery.com అనుసరించండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »