మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తున్నాయి. ఇప్పుడు మీరు చదవబోయే జంతువులూ కిన్ని సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. వాటిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. టాస్మానియాన్ టైగెర్ Tasmanian Tiger
ఇవి మనం నివసించే భూమిపైకి 40 లక్షల సంవత్సరాల క్రితమే వచ్చాయి. దీనికి సంబంధించిన చివరి జంతువు 1933 లో టాస్మానియాలో చివరి సారిగా కనపడింది. ఇది ఒక మాంసాహారపు జంతువు. దీని వీపున దిగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం ఇవి ఈ ప్రంపంచంలో ఒక్కటి కూడా లేవు. దీని సైన్టిఫిక్ నేమ్ తైలాసినస్. ఈ జంతువు యొక్క బరువు 30 కిలోల వరకు ఉంటుంది.
2. స్టెల్లార్ సీ కౌ Stellar Sea Cow
దీని సైన్టిఫిక్ నేమ్ హైడ్రో టమాలిస్ గిగస్. 1741 సంవత్సరంలో జార్జ్ విలియం స్టెల్లార్ అనే వ్యక్తి దీనిని మొదటిసారిగా చూసాడు. అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెల్లార్ అనే పేరును పెట్టారు. ఇవి కనుగొన్న సమయంలో అలాస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరింగ్ సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి. ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 వ శతాబ్దంలో ఇవి 8 నుంచి 10 టన్నుల బరువు ఉండేవి.
3. వూలీ మామూత్ Wooly Mamooth
దీని సైన్టిఫిక్ నేమ్ మమ్ముతూస్ ప్రైమీజనిస్ . వీటిని సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం కనుగొన్నారు. ఇది Mamooth జాతికి చెందిన చివరి జంతువు. ఇది చూడటానికి అచ్చం ఏసియన్ ఎలిఫాంట్ లాగే ఉంటుంది. సైబీరియా మరియు అలాస్కాలోని దంతాలను,అస్థిపంజరాలు మరియు అక్కడి గుహ చిత్రాలను ఆధారంగా తీసుకొని వీటి ఆకారాన్ని గుర్తించారు. ఇవి అంతరించిపోయినట్లుగా 1796 లో జార్జ్ కర్వేర్ అనే వ్యక్తి తెలిపాడు.
4. సాబేర్ టూతేడ్ కాట్స్ Sabre Toothed Cats
ఇది ఒక మాంసాహారపు జంతువు . వీటికి దంతాలు చాలా పొడవుగా ఉంటాయి అంటే 30 నుండి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి వాటి నోటిని 16 0డిగ్రీల వరకు తెరవగలవు. అంటే ఇప్పుడున్న సింహాలకంటే రెండు రేట్లు పెద్దవిగా తెరవగలవు. ఇవి 55 మిలియన్ సంవత్సరాల క్రితం కనుగొన్నారు. వీటికి ఉన్న పొడవైన దంతాలను వేటాడకుండా ఎరను బిగించడానికి ఉపయోగించెవి. ఇవి సుమారు 10 వేల సంవత్సరాల క్రితం అంతరించి పోయాయి. ఇవి పిల్లి జాతికి చెందినవి.
5.జాపనీస్ సీ లయన్ Japanese Sea Lion
ఇది ఒక అక్వాటిక్ అనిమల్ . వీటి బరువు సుమారు 450-560 కిలోల వరుకు ఉంటుంది. వీటి పొడవు 2.3 – 2. 5 మీటర్ల వరకు ఉంటుంది. వీటిలో ఆడజాతికి చెందినవి మగవాటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. 1900 సంవత్సర కాలంలో మనుషులు ఎక్కువగా వేటాడేవారు. 1970 సంవత్సరంలో ఇవి పూర్తిగా అంతరించి పోయాయి.
మనుకు తెలియని ఎన్నో రహస్యాలను తెలుసుకోవాలంటే తెలుగుడిస్కవరీ.కామ్ అనుసరించండి.