ఫిరానా చేపల గురించి నమ్మలేని నిజాలు – Unbelievable facts about piranha fish
Unbelievable facts about piranha fish – Telugu
- ఫిరనా (piranha) చేపలు నోటి నిండా సూది లాంటి పళ్ళు ఉంటాయి. ఎవరైనా కనిపిస్తే చాలు ఇలా ఫిష్ దాని పళ్ళతో దాడి చేసి చంపేస్తాయి.
- ఫిరనా చేపలను సౌత్ అమెరికా ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఇక్కడే కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నాయి. వీటిని టూత్ ఫిష్ అని కూడా అంటారు. ఎందుకంటే వీటి నోటి నిండా పళ్ళు ఉంటాయి. జీవితాంతం ఎన్నిసార్లు పళ్ళు ఊడినా కూడా మళ్లీ పెరుగుతూనే ఉంటాయి.
- ఫిరనా చేపలు రెండు అడుగుల సైజు మించి ఎక్కువ పెరగవు.
- ఇది సౌత్ అమెరికా నుంచి ప్రపంచంలోని చాలా దేశాలు వ్యాపించాయి. దీనికి కారణం ఏమిటంటే సౌత్ అమెరికాలోని పెట్ లవర్స్ వీటిని చిన్న గా ఉన్నప్పుడు ఎక్వేరియంలో పెంచేవారు అవి ఆ ఎక్వేరియంలో పట్టనంత సైజులో పెరిగిన తర్వాత వాటిని తీసి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రములో వదిలేసే వారు ఇలా బ్రిటన్, చైనా చాలా దేశాలకు వ్యాపించాయి.
- ఫిరనా చేపలు ఎక్కడికి వెళ్ళినా గుంపులుగుంపులుగా తిరుగుతాయి.ఎందుకంటే శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం ఎవరైనా తమ మీద దాడి చేస్తే వెంటనే తిరగబడ్డతాయి.
- ఇవి సముద్రంలో చాలా లోతులో నివసిస్తాయి. నీటిలో కింద ఇసుకలో లక్షల్లో గుడ్లు పెడతాయి.ఆ గుడ్లు పొదిగే వరకు మగ చేపలే బాధ్యత తీసుకొని కాపలాగా ఉంటాయి. పొరపాటున గుడ్ల జోలికి వస్తే అంతే సంగతులు వాటి అంతు చూసే వరకు నిద్రపోవు.
- ఇవి నివసిస్తున్న నీటిలో ఏదైనా పెద్ద శబ్దం వచ్చిన, రక్తంతో కూడిన వాసన వచ్చినా వెంటనే గుంపులుగా అక్కడికి చేరిపోతాయి. ఏదైనా జంతువు గాని, మనిషి శరీరం కానీ వీటికి దొరికితే గుంపులు గుంపులుగా దాడిచేసి పీక్కొని తినేస్తాయి.
- ఫిరానా చేపలు నీటిలో ఒక రకమైన శబ్దాన్ని చేస్తాయి. వాటికి ఆహారం దొరికిన వెంటనే ఈ శబ్దం ఆధారంగా మిగిలిన పిరానా చేపలు అన్ని ఒకేసారి వచ్చి వాటిని తినేస్తాయి.
- ఒకవేళ ఫిరనా చేపను ఎవరైనా గాలం వేసి పట్టుకుంటే ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం ఆధారంగా మిగిలిన చేపలు అటు వైపు రాకుండా దూరంగా వెళ్లిపోతాయి.
ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలంటే ప్రతిరోజు telugudiscovery.com అనుసరించండి