Science & TechnologyDiamonds Facts

వజ్రాలు ఎలా దొరుకుతాయి – How to find diamonds

వజ్రం (డైమండ్) అనేది చాలా విలువైనది. కొన్ని రకాలైన డైమండ్లు మనకు దొరికినట్లయితే ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా మనం మారిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ వజ్రాలు ఎలా ఏర్పడతాయి, ఎక్కడ దొరుకుతాయి, మైనింగ్ ఎలా  చేయాలి అనేదాని గురించి  తెలుసుకుందాం.

వజ్రం (డైమండ్ ) ఎలా ఏర్పడుతుంది ?

డైమండ్ అనేది  కార్బన్  అణువులతో నిర్మితమై ఉంటుంది. సాధారణ రాళ్ళ మాదిరిగా కాకుండా వజ్రాలలో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఉంటాయి.  వజ్రాలు అనేవి బొగ్గు నుంచి ఏర్పడతాయని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదు ఇవి భూమి లోపల నుండి ఏర్పడతాయి. సుమారు 100 నుండి 300 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉపరితలం నుండి 150 నుండి 250 కీ ,మీ లోపల ఈ వజ్రాలు ఏర్పడ్డాయి. ఈ లోపలి ప్రదేశాన్ని ఎర్త్ మాంటిల్ అంటారు. ఎర్త్ మాంటిల్ లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్స్  అక్కడ ఉండే అధిక ఉష్ణోగ్రత కారణంగా వజ్రాలు ఏర్పడుతాయి.  నిజానికి వజ్రాలకు రంగు ఉండదు.  కానీ వజ్రాలు ఏర్పడేటప్పుడు  10 లక్షల కార్బన్ అణువులతో 1 బోరాన్ తోడైతే ఆ వజ్రం నీలిరంగు వజ్రంగా మారుతుంది. అదేవిధంగా 10 లక్షల కార్బన్ అణువులతో  నైట్రోజన్ తోడైతే అది పసుపురంగు వజ్రంగా మారుతుంది.  ఒకవేళ  వజ్రాలతో కార్బన్ అణువుల ఆకృతి (స్ట్రక్చెర్)  సరిగ్గా ఏర్పడకపోతే ఆ వజ్రం గోధుమ రంగు వజ్రంగా మారుతుంది. ఒకవేళ డైమండ్ పై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటె అది ఆకు పచ్చ వజ్రంగా  (గ్రీన్ డైమండ్)  మారుతుంది. ఈ విధంగా కలర్ డైమండ్స్ అనేవి ఏర్పడతాయి.
Telugu Discovery
Blue Daimonds

 

Green Daimonds

 

Grey Daimonds

వజ్రాలను ఎలా బయటికి తీస్తారు ? వీటిని ఎలా గుర్తిస్తారు ?

వజ్రాలను వెలికితీయడానికి ఇప్పటి వరకు 12 కీ మీ లోపలకు మించి ఎక్కువ లోతు తవ్వలేక పోయారు . అలాంటిది వందల కిలోమీటర్లు తవ్వడం అనేది సాధ్యపడదు. వజ్రాలు అనేవి చాలా అరుదుగా లభిస్తాయి.  ప్రపంచం మొత్తంలో ఇప్పటివరకు బంగారాన్ని  1,75,000 టన్నుల వరకు వెలికి తీశారు. డైమండ్స్  కేవలం 500 టన్నులు మాత్రమే  వెలికి తీశారు.

వజ్రాలు ఉండే ప్రాంతాన్ని గుర్తించడం

  1. అగ్ని పర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు పైకి రావడం జరుగుతుంది. ఇటువంటి అగ్నిపర్వతాలు ఉన్నచోట నదులు, సరస్సులు ఉన్నట్లయితే అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తరువాత గాలి,వర్షం మరియు వరదల కారణంగా అవి నదులలోకి కొట్టుకొని పోతాయి. ఇలా వెళ్ళినవి నదుల్లో ఉండే రాళ్ళ మధ్యలో పేరుకుపోతాయి. అగ్నిపర్వతాలు బద్దలైన చోట ఏవైనా నదులు గనుక ఉన్నట్లయితే ఆ నదిలోని నీటిని  డ్యామ్  ద్వారా ఆపివేసి ఆ నది మొత్తాన్ని స్క్రీనింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అక్కడ డైమండ్స్ ఉన్నాయో లేవో అనే విషయాన్ని తెలుసుకుంటారు.
  2. అగ్నిపర్వతాలు బద్దలైన చోట తవ్వకాలు జరిపినట్లయితే వజ్రాలను గుర్తించవచ్చు. అదేవిధంగా అక్కడ పడివున్న రాళ్ళలో వజ్రాలు కనపడే అవకాశం ఉంటుంది.
  3. ఆస్టరాయిడ్స్ పడిన ప్రాంతంలో కూడా చిన్న,చిన్న డైమండ్లు దొరికే అవకాశం ఉంది.

వజ్రాల గురించి మరికొన్ని ముఖ్య విషయాలు

  • ప్రపంచంలో వజ్రాలు ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం రష్యా. ప్రపంచం మొత్తంలో 36% ఉత్పత్తి ఈ దేశం నుండే జరుగుతుంది.
  • డైమండ్స్ అనేవి భూమి లోపల నుండి స్టోన్ రూపంలోనే వస్తాయి. వీటిని పాలిష్ చేస్తేనే అద్భుతమైన డైమండ్స్ గా మారుతాయి.
  • డైమండ్స్ ని పాలిష్ చేసే దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది.
  • ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూర్ డైమండ్ కూడా ఇండియాలోనే దొరికింది. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ దేశంలో ఒక మ్యూజియంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *